” బేవార్స్ చిత్రాన్నివిజయవంతం చేసినందుకు యూనిట్ తరపున అందరికి నా కృతజ్ఞతలు , ఈ కథని నమ్మి నందుకు ఇంతమంచి ఆదరణ రావడం సంతోషం. మానవీయ విలువల్ని ఈ చిత్రంలో ప్రతిబింబించాము .. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు . ఈ రోజు మా చిత్రం బావుందని ఒక 10 థియేటర్లు పెంచడం ఆనందంగా ఉంది. దాసరినారాయణరావుగారు నన్ను నోరారా అల్లుడు అని పిలిచేవారు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఎప్పుడూ చిన్న సినిమాల గురించే మాట్లాడేవారు చిన్న సినిమాలను ఇంకా మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు. రాజేంద్ర ప్రసాద్ .
కాసం సమర్పణలో ఎస్. ఎస్.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్. అరవింద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం బేవర్స్ . ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. సునీల్‌కశ్యప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు కాశీవిశ్వనాధ్‌మాట్లాడుతూ… యూనిట్ అందరికీ చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు డా.రాజేంద్రప్రసాద్. ఆయన సినిమా ప్రమోషన్ కోసం ప్రతి ఫంక్షన్‌కి రావడం చాలాఆనందంగా వుంది . అలాంటి ఆర్టిస్ట్‌తో కలిసి నటించినందుకు చాలా గర్వ పడుతున్నాను. ఈ సినిమాని రూపొందించినందుకు రమేష్ చప్పాలగారికి నా కృతజ్ఞతలు అన్నారు. దివ్యవాణి మాట్లాడుతూ… ఈ సినిమా లొ సిరి అనే పాత్ర పోషించడం చాలా ఆనందంగా
ఉంది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు రాజేంద్రప్రసాద్‌గారి సపోర్ట్ నేను మర్చిపోలేను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన రమేష్‌గారికి
ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ… నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి ఆదరణ వస్తుందని నేను
ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నన్ను ఈ చిత్రంలో భాగంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు.
హీరో సంజూష్ మాట్లాడుతూ… చాలా హ్యాపీగా ఉంది హిట్ అయినందుకు,. ఈ సందర్భంగా చెప్పుకోవల్సింది మంచి ఎమోషనల్ విలువలున్న మూవీ తీశారు. అందరికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రాజేంద్రప్రసాద్‌గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్స్‌కి నా కృతజ్ఞతలు.
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. ఈ చిత్రం విడుదలై మంచి స్పందన వచ్చింది.. ఈ రోజు హైదరాబాద్‌లో 9 థియేటర్లలో నైజాంలో5 థియేటర్లు పెంచడం జరిగింది.. రాజేంద్రప్రసాద్‌గారికి అందరికి నా కృతజ్ఞతలు అన్నారు.
పొన్నాల చందు మాట్లాడుతూ… ఇది నా తొలి సినిమా. ఈ కథ నచ్చి మనస్ఫూర్తిగా చేశాను. ఈ జర్నీలో నాకు చాలా అనుభవం వచ్చింది. సినిమా హిట్ అయినందుకు గర్వంగా ఉంది.అన్నారు. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇంత దూరం రాగలిగాను నాకు మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు. . ఆయన ప్రోత్సాహంతోనే ఇంత దూరంవచ్చాను . నన్ను మీరందరూ ఇదే విధంగా ఆదరించాలని నేను ఇంకా ఎన్నో చిత్రాలు తియ్యాలని కోరుకుంటున్నాను, అన్నారు.