రతన్ టాటా బయోపిక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో

madhavan

బయోపిక్ కథలకు ఇటీవల కాలంలో రెస్పాన్స్ బాగానే వస్తోంది. స్టార్స్ కూడా రియాలిటీ స్టోరీలను ఛాలెంజింగ్ గా తీసుకొని మరి అంచనాలకు మించి కష్టపడుతున్నారు. ఇక ఇటీవల సూర్య నటించిన ఆకాశం న్యూ హద్దురా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో డైరెక్టర్ సుధ కొంగర క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆమె తరువాత ఎలాంటి సినిమాతో వస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

madhavan

ఎయిర్ డెక్కన్ గోపినాథ్ జీవిత కథను ఎంతో ఎమోషనల్ గా చూపించిన సుధ కొంగరా గ్రేట్ పర్సన్ రతన్ టాటా బయోపిక్ ను కూడా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. రతన్ టాటా పాత్రలో మాధవన్ కనిపించే అవకాశం ఉన్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మాధవన్ వెంటనే క్లారిటీ ఇచ్చాడు.

ఇది నిజం కాదని అంటూ.. కొంతమంది అభిమానులు ఇది నిజం కావాలని కోరుకుంటూ డిజైన్ చేసిన పోస్టర్ అని వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే తన వద్దకు అలంటి ప్రాజెక్ట్ కు సంబంధించినది ఏది కూడా రాలేదని చర్చలు కూడా జరగలేదని మాధవన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మాధవన్ క్లారిటీ ఇవ్వడంతో సుధ కొంగరా తరువాత ప్రాజెక్ట్ పై మరోసారి సస్పెన్స్ నెలకొంది. లైకా ప్రొడక్షన్స్ అయితే ఇప్పటికే ఆమెతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.