దగ్గుబాటిని మరిపించిన భరత్ రెడ్డి

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను “ఎన్టీఆర్  మహా నటుడు ” , “ఎన్టీఆర్ మహా నాయకుడు పేరుతో క్రిష్  దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మిస్తున్న సినిమా షూటింగ్  షరా వేగంగా జరుగుతుంది . ఈరోజున దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్రలో నటిస్తున్న డాక్టర్ భరత్ రెడ్డి లుక్ విడుదల చేశారు . మంగళవారం  భరత్ రెడ్డి జన్మదినం కావడంతో ఈ లును విడుదల చేసినట్టు తెలిసింది .

 
ఇందులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్రధారి  భరత్ రెడ్డి వున్న పోస్టర్ ఆసక్తిని  కలిగిస్తున్నది .  భరత్ రెడ్డి అచ్చు
దగ్గుబాటి వెంకటేశ్వర రావులాగే ఉండటం గమనార్హం . గతంలో నారా చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తున్న దగ్గుబాటి రానా పోస్టర్ను
కూడా విడుదల చేశారు . రానాను చంద్ర బాబులాగా మౌల్డ్ చేసి అందరిని ఆశర్య చకితులను చేశాడు క్రిష్ . “ఎన్టీఆర్ బయోపిక్ ” విషయంలో నిర్మాత దర్శకులు ఎంత శ్రద్ద తీసుకుంటున్నారో  దీనిని బట్టి అర్ధమవుతుంది .