ఇదీ ‘ఆర్ ఆర్ ఆర్’ స్టోరీ లైన్ : రాజమౌళి

ఈ రోజు జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ సందర్భంగా రాజమౌళి చిత్రం కథకు సంభందించి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కామెంట్స్ చేశారు. అలియా భట్‌.. సీతగా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించనుందన్నారు. అదే సమయంలో అజయ్‌ దేవగన్‌ చేయబోయేది విలన్‌ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు.

అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రం కథ గురించి మాట్లాడుతూ రాజమౌళి ఏమన్నారంటే..

రాజమౌళి మాట్లాడుతూ..‘‘1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లమే కాకుండా వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.

1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక చదువకుని వచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది.’’ అన్నారు.