సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా బిజినెస్ మోడ్ లోనే నడుస్తుంది. అయితే రకుల్ ప్రీతి సింగ్ మాత్రం ఆ స్దాయి దాటేసింది. ఆ లెక్కలు ఆమె ముందు పని చేయటం లేదు. హిట్ అయినా ప్లాప్ అయినా తన రేటు తగ్గిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది.
వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో పరిచయం అయిన రకుల్ అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. అయితే మహేష్ తో చేసిన ‘స్పైడర్’ పరాజయం ఎఫెర్చ్ ఆమె కెరియర్ పై బాగానే పడింది.
ఆ సినిమా తర్వాత నుంచే ఆమెకి అవకాశాలు తగ్గాయి. అయితే రకుల్ తెలివైంది. ఇక్కడ కాస్త తేడా కొట్టగానే తమిళంపై కాన్సర్టేట్ చేసింది. దాంతో ఆమె తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూనే, తమిళంలో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎక్కువకాలం ఉండటానికి ట్రై చేస్తోంది.
అయితే అక్కడా పని జరగటం లేదు. రీసెంట్ గా వచ్చిన కార్తీ హీరోగా వచ్చిన ‘దేవ్’ కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
తమిళంలో హిట్ కొట్టిన ‘రాచ్చసన్’ కి ఇది రీమేక్. అయితే మీకు హిట్లు లేవు కదా, పారితోషికం తగ్గించుకోవచ్చు కదా అంటే హిట్ అయినప్పుడు నేను ఎక్కువ పెంచేయటం లేదు అని అంటోంది. ఈ విషయంలో ఆమె మెట్టు దిగలేదట. ఎప్పటిమాదిరిగానే ఈ సినిమా కోసం కోటిన్నర తీసుకుంటోందని టాక్. గతంలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘జయ జానకి నాయక’ చేసిన సంగతి తెలిసిందే.