మహానటుడు ఎన్ .టి రామారావు “మనదేశం “సినిమాతో ప్రేక్షక లోకానికి నటుడుగా పరిచయమయ్యాడు . మనదేశం సినిమాను మీర్జాపురం రాజావారు శోభన చలం పిక్చర్స్ బేనర్ మీద ఎల్ .వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు . మీర్జాపురం రాజా భార్య , నటి కృష్ణవేణి ఈ సినిమాను సమర్పించి నటించారు .
సరిగా 69 సంవత్సరాల క్రితం అంటే 1949 నావేమ్బర్ 24 న విడుదలైంది . బెంగాలీ రచయిత శరశ్చంద్ర ఛటర్జీ నవల విప్రదాస్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు . భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని జరుగుతున్న పోరాటాన్ని తెలిపే కధే “మనదేశం “
ఈ చిత్రంలో చిత్తూరి నాగయ్య , నారాయణ రావు , కృష్ణవేణి నటించారు . ఘంటసాల వెంకటేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు . ఎన్ .టి రామారావు ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు .
మనదేశం సినిమాలో నటించిన రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత “నాదేశం ” అనే సినిమాలో నటించాడు . ఆయన స్థాపించిన పార్టీకి “తెలుగు దేశం “అనే పేరు పెట్టడం విశేషం .