కరోనా దెబ్బకు ప్రపంచం కకావికలం అయిపోతోంది. దీని ధాటికి దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే బ్లాక్ అయిపోయారు. ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో యుఎస్‌తో పాటు పలు దేశాల్లో చిక్కుపోయినన వారి పరిస్థితి అరణ్య రోదనగా మారింది.
ఇదిలా వుంటే కరోరా ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఓ హీరో 56 మంది టీమ్‌తో తన సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు. అక్కడ ప్రభుత్వం, పోలీసులు హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా షూటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ లోగా కరోనా ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీంతో దేశాలన్నీ లాక్ డౌన్‌ని విధించాయి.
దీంతో మలయాళ హీరో, టీమ్ జోర్డాన్ విడిచి ఇండియా రావడం అత్యంత క్లిష్టంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవల మలయాళంలో వరుస విజయాలు సాధిస్తున్న పృథ్వీరాజ్ తాజాగా `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు. ఇప్పుడు తిరిగి ఇండియా రావాలని ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మలయాళ ఇండస్ట్రీ పెద్దలు `ఆడుజీవితం` టీమ్‌ని ఇండియాకు సురక్షితంగా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.