“ఆకు చాటు పిందె తడిచే … కొమ్మ చాటు పువ్వు తడిచే ” పాట ఆంధ్ర దేశాన్ని ఉర్రుతలూగించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎమ్. అర్జున్ రాజు నిర్మించిన సినిమా. ఇక ఆ పాటలో ఎన్టీఆర్ శ్రీదేవి నటించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా 1979 జులై 5న విడుదలైంది. అప్పుడు ఎన్టీఆర్ కు 56 సంవత్సరాలు కాగా శ్రీదేవికి 16 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈ ఇద్దరి మధ్య 40 సంవత్సరాలు వయసు తేడా వుంది. అయినా ప్రేక్షకులు పట్టించుకోలేదు.
శ్రీదేవి లేలేత అందాలు, ఎన్టీఆర్ తరగని,చెరగని గ్లామర్ ఈ పాటను సూపర్ హిట్ చేశాయి. 39 సంవత్సారాల తరువాత ఈ పాట మళ్ళీ తెలుగు తెర మీద సందడి చేయబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు ఎన్టీఆర్, శ్రీదేవి పాత్రల్లో కనువిందు చెయ్యబోతున్నారు.
ఈ చిత్ర నిర్మాత ఎం. అర్జునరాజు తెలుగురాజ్యంతో మాట్లాడుతూ ” ఆ రోజుల్లో అదొక క్రెజీ కాంబినేషన్, రాఘవేంద్ర రావు పాటలను చిత్రీకరించడంలో ఎక్సపెర్ట్. అయితే చాలా మంది నిర్మాతలు, దర్శకులు నన్ను హెచ్చరించారు. చిన్న పిల్లతో రామారావు స్టెప్స్ వెయ్యడమా ” అన్నారు. అయినా నాకు రాఘవేంద్ర రావుకు బాగా నమ్మకం. మేము ఛాలెంజ్ గా తీసుకున్నాము ” అని చెప్పాడు.
చిత్రం విడుదలైన తరువాత రామారావు గారు ఎలా ఫీల్ అయ్యారు ? అని అర్జునరాజు గారిని అడిగాను.
“రాజుగారూ ,శ్రీదేవి , నను తెర మీద చూసుకుంటే ఆనందం , ఉద్వేగం కలిగింది ” అన్నారు. అలాగే “పెద్దాయన ఎన్టీఆర్ ను సరి కొత్తగా చూపించి ట్రెండ్ సృష్టించా “అని రాఘవేంద్ర రావు అనేక సార్లు నాతో చెప్పాడు. రామారావు గారంటే నాకెంతో అభిమానం, రాఘవేంద్ర రావుకు అయితే ఆరాధనా భావం ” చెప్పాడు అర్జున రాజు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మా పాత బంగారాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్న బాలయ్య బాబుకు, దర్శకుడు క్రిష్ కు అభినందనలు. “ఆకు చాటు పిండే తడిచే … కొమ్మ చాటు పువ్వు తడిచే పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత ఆత్రుత వుంది “అని చెప్పారు వేటగాడు సినిమా నిర్మాత అర్జునరాజు