సీఎం రైట్ హ్యాండా ఆ కమెడియన్?
తెలుగు సినీపరిశ్రమలో జాక్ పాట్ అంటే కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్ దే. సినీపరిశ్రమలో ఎదిగేందుకు దాదాపు 30 ఏళ్ల పాటు పాకులాడాల్సొచ్చిందని చెప్పే పృథ్వీ తనకో టైమ్ రాగానే ఓ రేంజులో అవకాశాలు అందుకున్నాడు. అందుకు తగ్గట్టే నాలుగు రూకలు వెనకేసుకున్నాడు. అంతేకాదు సాటి నటీనటుల్ని కూడా ఆ రేంజులోనే ఆడేసుకున్నాడని చెబుతారు.
అయితే ఇక ఆ ఆట ఇప్పుడు అయిపోయింది. రాజకీయాల్లో ప్రవేశించడంతో ఇక సినీఛాన్సుల్లేవ్. అప్పట్లో మెగా కాంపౌండ్ పై విమర్శించడంతో అసలే లేకుండా పోయాయి. అయితే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి కాబట్టి అతడి ప్రభ వెలుగుతోందట. అతడికి తెలుగు సినీపరిశ్రమలో ప్రత్యేక గౌరవం దక్కుతోంది. ఎంతగా అంటే అతడికి పిలిచి పిల్లనిచ్చేస్తామంటున్నారు. ఇటీవలే తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కి ప్రత్యామ్నాయంగా పేరు తెచ్చుకుంటున్న తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం(టీఎంటీఏయు) వాళ్లు అతడిని అధ్యక్షుడిని చేసేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 760 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ కి పెద్ద దిక్కు కావాలంటూ అతడిని ఏకగ్రీవంగా అసోసియేషన్ అధ్యక్షుడిని చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక ఈ ఒక్క అసోసియేషన్ లోనే కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎస్వీబీసీ ఛైర్మన్ హోదాలో గౌరవం అందుకుంటున్నారు. పదవి- అధికారం ఉంటే కమెడియన్ అయినా అందలం ఎక్కేస్తారు! అనేందుకు పృథ్వీ ఎగ్జాంపుల్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి గౌరవాన్నే కదా ఎవరైనా కోరుకునేది!!