ట్రైల‌ర్ : విజువ‌ల్ వండ‌ర్ 2.ఓ

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో దాదాపు 543 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రోబో 2.ఓ .  ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండగా, వీటికి సంబంధించిన వర్క్ విదేశాలలో  జరిపారు.

రోబోకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్ లో రిలీజ్ చేసారు. హాలీవుడ్ గ్రాఫిక్స్ తో  రూపొందిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచేసింది.  

రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , ఏ.ఆర్ రెహమాన్ , శంకర్ , అమీ జాక్సన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ ని 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేసారు. ఇందులోని సన్నీ వేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకునేలా  చేస్తున్నాయి.ఏ.ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గ మారనుంది.

 

 

2.0 - Official Trailer [Telugu] | Rajinikanth | Akshay Kumar | A R Rahman | Shankar | Subaskaran