మిస్డ్ కాల్ ఇవ్వండి:  ‘రోబో -2’ 3డి వెర్షన్ టీజర్  చూడండి

                                                         (సూర్యం)

సౌతిండియా  సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “2.O”. గతంలో వచ్చిన ‘రోబో’కు సీక్వెల్. ఈ చిత్రం
త్వరలోనే  మన ముందుకు రానుంది. అయితే  వినాయకచవితి సందర్భంగా ‘2.ఓ’ 3డీ టీజర్‌ను చిత్ర యూనిట్  విడుదల చేస్తోంది.  ఇంతకు ముందు ఏ ఇండియన్ సినిమా తెరకెక్కించని రీతిలో శంకర్‌ ‘2.ఓ’ను తీర్చిదిద్దారని చెప్తున్నారు.

ఈ సినిమా మొత్తాన్ని 3డీ కెమెరాలతోనే తెరకెక్కించారు. ఈ సందర్బంగా చిత్ర టీజర్‌ను కూడా త్రీడిలో చూస్తే బాగుంటుంది కదా. అదే ఈ చిత్రం దర్శక,నిర్మాతలు కూడా ఆలోచించారు. 3డి వెర్షన్ ను  థియేటర్‌లలో ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. మరి ఈ త్రీడి టీజర్ చూడాలంటే ఏం చేయాలి..

3డీ టీజర్‌ను చూడాలనుకునేవారు దగ్గర్లోని పీవీఆర్‌, సత్యం థియేటర్స్‌లో చూడవచ్చు. ఇందుకోసం 90999 49466కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఉచిత టికెట్‌ను బుక్‌ చేసుకోవాల్సిందిగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ ను కోరుతోంది. అలా ఉచిత టికెట్‌ పొందిన వారు వినాయకచవితి రోజున 3డీ టీజర్‌ను చూడవచ్చు. మరెందుకు ఆలస్యం… మిస్డ్ కాల్ ఇవ్వండి.