2019 సిరుల పంట పండించిన టాప్ 3 సినిమాలు !

2019 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఏడాది అనే చెప్పుకోవాలి. ఎన్నో సినిమాలు వచ్చినా మంచి సినిమాలను ఎప్పట్లాగే జనం ఆదరించారు. అయితే… అస్సలు ఊహించని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించగా, ఎంతో పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చిన చిత్రాలు బోల్తా కొట్టాయి. మరి ఇప్పటివరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఓ మూడు చిత్రాల గురించి మ‌నం ఇక్క‌డ చెప్పుకుందాం…

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)…

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేటా’, ‘వినయ విధేయ రామ’ వంటి బడా చిత్రాలు ఆ తరుణంలో విడుదలైనా.. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. అంతేకాక పండగకు ఈ మూవీ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వ‌రుణ్‌, వెంక‌టేష్‌ల కాంబినేష‌న్‌లో వాళ్ళ‌ కామెడి టైమింగ్ అదిరిపోయింది.

మహర్షి…

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మహేష్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. యాక్షన్, మెసేజ్, ఎమోషన్స్ ఒకటేమిటి ఇలా అన్ని కూడా ఈ మూవీలో సమపాళ్ళులో ఉన్నాయి. ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘మహర్షి’ మహేష్‌కు మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో అల్ల‌రిన‌రేష్, మ‌హేష్ ల మ‌ధ్య ఉంటే ఎమోష‌న్స్ సినిమాలో చాలా బాగా పండాయ‌నే చెప్పాలి. అలాగే పూజా హెగ్డే మ‌హేష్ కాంబినేషన్ కూడా సూప‌ర్బ్ అనిపించుకుంది.

మజిలీ…

అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. వీరిద్ద‌రు పెళ్ళ‌య్యాక క‌లిసి న‌టించిన మొద‌టి చిత్రం. దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కుటుంబ కథలను రూపొందించడంలో శివ దిట్ట. అతడి గత చిత్రం ‘నిన్ను కోరి’ మాదిరిగానే ఈ మూవీకు కూడా ప్రేక్షకులు నుంచి విశేషదారణ లభించింది. ఇందులో వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే ఎమోష‌న్ బాండింగ్ చాలా బాగా కుదిరింది.