విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ అనే బిరుదు మహా నటుడు ఎన్టీ రామారావు కు ఇస్తే అప్పట్లో చాలా మంది , విశ్వ విఖ్యాత అనే బిరుదు ఓ ప్రాంత హీరోకు ఇవ్వడమా ? అని చులకనగా మాట్లాడారు . అయితే కాలక్రంలో రామారావు నట జీవితానికి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు . హీరోగా బాగా డిమాండు ఉండగానే 1982లో సినిమాకు గుడ్ బై చెప్పాడు . ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలంటే విరక్తి చెంది, ఢిల్లీ పెద్దలపై సవాలు విసిరి తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అన్న అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు . అప్పటివరకు వున్న మద్రాసీ ముద్ర చెరిపేశాడు . తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీ రామారావు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ సార్ధకం చేసుకున్నాడు .
1948 ఆ ప్రాంతామ్ లో తాను చేస్తున్న వుద్యోగం నచ్చక రాజీనామా చేసి, తనకిష్టమైన సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు . ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన “మనదేశం “సినిమాలో పోలీస్ మన్ పాత్రలో రామారావు నటించాడు . ఈ సినిమా 24 నవంబర్ 1949లో విడుదలైంది . ఈ చిత్రం కోసం రామారావుకు మేకుప్ చేసి స్టిల్ తీసి చూసుకున్నాక ఎల్వీ ప్రసాద్ వేషం ఖాయం చేశాడు . 1949లో రామారావు మేకప్ స్టిల్ ఇది .