19 ఏళ్ల యువ‌కుడిలా 40 ఏజ్ హీరో.. ఇదెలా సాధ్యం?

19 ఏళ్ల యువ‌కుడిలా 40 ఏజ్ హీరో.. ఇదెలా సాధ్యం?

క‌మిట్ మెంట్ అంటే సూర్య‌. సూర్య అంటే క‌మిట్ మెంట్. అందుకే ఆయ‌న ఏం చేసినా అటు త‌మిళంతో పాటు ఇటు తెలుగు జ‌నం అంతే ఆత్రంగా వేచి చూస్తుంటారు. గ‌జిని.. సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ లాంటి చిత్రాల్ని త‌మిళ తంబీల కంటే తెలుగులోనే ఎక్కువ ఆద‌రించారంటే సూర్య‌లో సంథింగ్ ఏదో న‌చ్చ‌డం వ‌ల్ల‌నే. ఆ డెడికేష‌న్ కి ఫిదా అయిపోతారంతా. ఇక తెర‌పై ఎంచుకున్న పాత్ర కోసం ఎంత దూర‌మైనా వెళ్ల‌డం ఆయ‌న‌కే చెల్లింది.

ప్ర‌స్తుతం సూర్య ఆకాశ‌మే హ‌ద్దుగా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత‌క‌థ ఆధారంగా రూపొందుతోంది. ఆయ‌న 19 ఏళ్ల వ‌య‌సు నుంచి 40 వ‌చ్చే వ‌ర‌కూ సాగించిన ప్ర‌యాణాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అంటే వివిధ ద‌శ‌ల్లో హీరో పాత్ర ర‌క‌ర‌కాల రూపాల్లోకి మారుతుంద‌న్న‌మాట‌. అయితే ఇందులో అత్యంత క్లిష్ట‌మైన‌ది 19 వ‌య‌సులో 40 ఏళ్ల సూర్య క‌నిపించాల్సి రావ‌డం. అయితే దానికోసం అత‌డు ఏ రేంజులో శ్ర‌మించాడో ఈ మేకింగ్ వీడియో చూస్తేనే అర్థ‌మైపోతోంది. సూర్య ఆన్ లొకేష‌న్ సైతం క‌స‌ర‌త్తులు వ‌దిలిపెట్ట‌లేదు. త‌న కోచ్ సాయంతో ప్ర‌తిచోటా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాడు. త‌న క‌మిట్ మెంట్ కి ద‌ర్శ‌కురాలు సహా కోచ్ ఫిదా అయిపోయి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. పందొమ్మిది వ‌య‌సులో చేసిన‌ట్టు జిమ్ చేయాలంటే అంత సులువేమీ కాదు. కండ‌రాలు ప‌ట్టేస్తాయి. చాలా జాగ్ర‌త్త‌లే తీసుకోవాలి. సూర్య అన్నిటినీ పాటిస్తూ డెడికేష‌న్ చూపించి వ‌య‌సును స‌గానికి స‌గం త‌గ్గించేయ‌గ‌లిగాడు. పాత్ర కోసం ఈ క‌ష్టం. ఇక ఆకాశ‌మే హ‌ద్దుగా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఇటీవ‌ల తెలుగులో సూర్య కెరీర్ ఏమంత బాలేదు. త‌మిళంలోనూ ఆశించిన రిజ‌ల్ట్ లేక‌పోవ‌డంతో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. మ‌రి ఒక బ‌యోపిక్ తో అత‌డి కంబ్యాక్ సాధ్య‌మేనా? అన్న‌ది కాస్త ఆగితే కానీ తేల‌దు. క‌రోనా మ‌హ‌మ్మారీ నుంచి బ‌య‌ట‌పడేది ఎప్పుడు? జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లేది ఎప్పుడు? అన్న‌దే ఇప్ప‌టికి స‌స్పెన్స్. మ‌రి సూర్య సినిమా ఎప్పిటికి బ‌య‌ట‌ప‌డుతుంది? అన్న‌దానికి కాలమే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ ఈ మేకింగ్ వీడియోతో ఎంట‌ర్ టైన్ అవ్వాల్సిందే.

From Script to Screen - Soorarai Pottru Making Video | Suriya | G.V. Prakash Kumar | Sudha Kongara