పాలిటిక్స్ బేస్డ్ మూవీస్ అంటే ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. సినిమాల్లో హీరోలు వేసే పాత్రల్లో రఫ్, మాస్, క్లాస్, సెంటిమెంట్ ఉంటాయి. వీటికి మించి తమ హీరోలు పొలిటీషియన్లుగా.. అదీ సీఎంగా నటిస్తే ఆ కిక్కే వేరు. అలా తెలుగు సినిమాల్లో ముఖ్యమంత్రులుగా నటించిన వారు ఉన్నారు. వారెవరో చూద్దాం..
బాలకృష్ణ: ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయుకుడులో సీఎం ఎన్టీఆర్ పాత్రలో నటించారు.
మమ్ముట్టి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై తెరకెక్కిన ’యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్రలో మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ‘ఛీఫ్ మినిష్టర్’ అనే మళయాళ సినిమాలో కూడా సీఎంగా నటించారు.
మహేశ్: ‘భరత్ అను నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు.
విజయ్ దేవరకొండ: ‘నోటా’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.
రానా: తొలి సినిమాగా ‘లీడర్’ లో ముఖ్యమంత్రిగా నటించారు.
జగపతిబాబు: ‘అధినేత’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు.
శతృఘ్న సిన్హా: ‘రక్త చరిత్ర’ సినిమాలో సీఎం ఎన్టీఆర్ పాత్రలో నటించారు.
వినోద్ కుమార్: వైయస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘భగీరథుడు’లో సీఎంగా నటించారు.
దాసరి నారాయణ రావు: ‘ఎమ్మెల్యే ఏడు కొండలు’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. హిందీలో రాజేష్ ఖన్నా సీఎంగా నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు: ‘రాజకీయ చదరంగం’ మూవీలో సీఎంగా కనిపించారు.
కృష్ణ: ‘ముఖ్యమంత్రి’ సినిమాలో కృష్ణ టైటిల్ పాత్రను పోషించారు.
రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్…రీల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు.
ఉపేంద్ర: కన్నడలో ‘సూపర్’ సినిమాలో సీఎంగా నటించారు.
మోహన్ లాల్: ’ఇద్దరు’ సినిమాలో సీఎంగా నటించారు.
అర్జున్: ‘ఒకే ఒక్కడు’లో ఒకరోజు ముఖ్యమంత్రిగా నటించారు. హిందీలో అనిల్ కపూర్ చేశారు.
సురేష్ గోపీ: ‘రాష్ట్రం’ అనే మలయాళ డబ్బింగ్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు.
కంగనా రనౌత్: ‘తలైవి’ సినిమాలో మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించారు.
’NGK’: ఈ సినిమాలో సూర్య ముఖ్యమంత్రిగా నటించారు.
నిజ జీవితంలో ముఖ్యమంత్రులైన ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్.. సినిమాల్లో సీఎంలుగా నటించలేదు.