తెలుగు రీమేకే కానీ హాట్ డోస్ పెంచేసారే

తమిళం వాళ్లు మనకన్నా కొన్ని విషయాల్లో అతి. వాళ్లు ఏదైనా కాస్త ఎక్కువగా కోరుకుంటారు. అందుకే మనం అరవ అతి అంటూంటాం. మన తెలుగు సినిమాలు రీమేక్ చేసేటప్పుడు కూడా వాళ్లు కాస్త అతిగానే తెరకెక్కిస్తూంటారు. అయితే ఒక్కోసారి అతి కూడా అతికినట్లు కుదురుతుంది.

తాజాగా అప్పట్లో నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో సుకుమార్ డైరక్షన్ లో వచ్చి సూపర్ హిట్టైన  ‘100% లవ్’ సినిమాను ఇప్పుడు ‘100% కాదల్’ అనే పేరుతో తమిళంలో రీమేక్ చేస్తోన్నారు.  ఆ చిత్రం టీజర్ రిలీజైంది. ఈ టీజర్ లో కాస్తంత అందాల డోస్ ఎక్కువైందనే అనిపిస్తోంది. తెలుగుకన్నా అడ్వాన్స్  గా వాళ్లు సీన్స్ తీసినట్లున్నారు. మీరూ చూసి నిజమో కాదో చెప్పండి.

 ఇక రీమేక్  ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. కానీ ఆమె తప్పుకుందని ఆ స్థానంలో హెబ్బా పటేల్ కనిపించనుందని అన్నారు. కానీ తాజాగా  ఆ ఆఫర్ ఇప్పుడు షాలిని చేతుల్లోకి వెళ్లింది. ఆమె కూడా కథ ఎగ్జైటింగ్ గా అనిపించడంతో  గీకరించింది. జి.వి.ప్రకాష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను చంద్రమౌళి డైరెక్ట్ చేస్తున్నారు.