కొన్ని వెబ్‌సైట్లలో వచ్చే గాసిప్ సరైన సమాచారం లేకుండా కనీస మినిమం నాలెడ్జ్ లేకుండా దర్శకుడు హరీశ్ శంకర్ వాపోతున్నారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు సినిమాలకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పింక్ రీమేక్ చిత్రంతో తిరిగి తెరమీద కనిపించబోతున్నారు. మేలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది మొత్తం నాలుగు చిత్రాల్లో చేయనున్నారు పవన్. రెండోది క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియడిక్ మూవీలో నటించనున్నారు. మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమా. అయితే ఇదిలా ఉంటే… హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఒక రీమేక్ సబ్జెక్ట్ వెతుకుతున్నారని, అదయితే ఒక సేఫ్ అని భావిస్తున్నాడని ఒక గాసిప్ వెబ్‌సైట్ వార్తను ప్రచురించింది.
ఇక దీని గురించి హరీష్ ఈ విధంగా స్పందించారు. ఇటీవలె మహేష్ నటించిన మహర్షి చిత్రంలోని సీన్‌ను ఆయన ఉదాహరణగా తెలిపారు. పెద్ద కంపెనీ సీఈఓ అయిన రిషి ఇండియాలో ఆరు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడని వార్తలు తానే సృష్టిస్తుంటాడు. ఇదేమని పక్క వాళ్ళు అడిగితే, ఒకవేళ పొరపాటున సీఈవో అదే పని చేస్తే, మేము ముందే చెప్పాం అని చెప్పుకోవచ్చని. ఒకవేళ అలా చేయకపోతే, ప్లాన్ మార్చుకుని ఉంటాడని ఇలా రక రకాలుగా సృష్టిస్తూ వాళ్ళకు ఎలా వీలుంటే అలా వార్తను మార్చేస్తూ ఉంటారని ఆయన అన్నారు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఒక గాసిప్ ను తన వెబ్‌సైట్ కూడా హరీష్ శంకర్ విషయంలో ఇలాగే గాల్లోకి రాయి విసిరినట్లు గా కనిపిస్తుంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం రీమేక్ సబ్జెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడని, రీమేక్ అయితే కమర్షియల్ గా సేఫ్ జోన్‌లో ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ రాసింది.
అలాగే ఆ సినిమా పేర్లను కూడా చెప్పేసింది అదేమితంటే వేదాళం సినిమా కానీ, తేరి సినిమా కానీ రీమేక్ చేయవచ్చని చెప్పారు. తేరి సినిమా పోలీసోడు అనే పేరుతో తెలుగులోకి డబ్ అయ్యిందని, గతంలో చాలా సార్లు ప్రసారం అయినట్లు రాశారు. దయచేసి పాఠకులను తప్పుదోవ పట్టించకండి మీరు ఇచ్చే సమాచారం కనీస సమాచారంతో వార్తలు ఇవ్వమని ఆయన ఆ వెబ్‌సైట్‌ను హేళన చేసి మాట్లాడారు. భవిష్యత్తులో అయినా సరే మీ పాఠకులను తప్పుదోవ పట్టించకుండా సరైన వార్తలు రాస్తే బాగుంటుందని ఆయన సూచించారు.