కొంత మంది హాట్ టీవీ యాంకర్లకు హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆ భామా మణులను లక్షల్లో అనుసరిస్తున్నారు. శ్రీముఖి, రష్మి గౌతమ్ , సుమ, అనసూయల ఖాతాలను చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. అసలు కన్నా..కొసరు వ్యాఖ్యలతో ఫేమస్ అయిపోతున్న ఈభామలంతా చిన్నా చితకా సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక జబర్దస్త్ కంటెస్టెంట్లకు.. కొంత మంది లేడీ యాంకర్లకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. పరిచయం ఒక్కరోజే అయినా…పదేళ్ల పరిచయం ఉన్నంత చనువుగా తొలి రోజు నుంచే మెలుగుతారు. రూమర్లను అంటించుకుంటారు.
జబర్దస్త్ ఆర్టిస్టులు…శ్రీముఖి, అనసూయ, వర్షిణీల పై వచ్చిన రూమర్లు గురించి చెప్పాల్సిన పనిలేదు. హైపర్ అది- అనసూయ గురించి వచ్చిన రూమర్లు అప్పట్లో హాట్ టాపిక్. ఇద్దరిపై బ్రహ్మాండం బద్దలైపోయేలా టాలీవుడ్ మీడియాలో రూమర్లు షికార్లు చేసాయి. తాజాగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్న వర్షిణి అందరికి సుపరిచితురాలే. అనసూయ, శ్రీముఖి వంటి భామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చినంతగా అమ్మడు యువతలో ఫాలోయింగ్ సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వేళ వర్షిణి అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో ఓ అభిమాని మీరు హైపర్ ఆదిలో లవ్ లో ఉన్నారని విన్నాం.
నిజమేనా? అని ప్రశ్నించాడు. ఏమో అలాం ఏం లేదు. అని నవ్వుతోన్న ఏమోజీని పోస్ట్ చేసింది. దీంతో మిగతా వాళ్లు ఏదో ఉందంటూ కామెంట్లు షురూ చేసారు. లవ్ లేకపోతే నవ్వుతోన్న ఏమోజీ దేనికి సంకేతం…అసంపూర్ణమైన మీ సమాధానంలోనే ఏదో అంతరార్ధం ఉందంటూ! ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీంతో అమ్మడు ఆది నాకు క్లోజ్…సుధీర్ కుటుంబ సభ్యుడు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడేమనుకోవాలో.