లాక్ డౌన్ నేపథ్యంలో పేదలందరి కష్టాలు కళ్లకు కట్టాయి. వాళ్లందరికీ ప్రభుత్వం..చారిటీలు…సెలబ్రిటీలు తరుపున ఎంతో కొంత సాయం అందింది. టాలీవుడ్ హీరో గోపీచంద్ అయితే నేరుగా పేదవారికి తన చేతుల మీదుగానే నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేసాడు. మిగతా సెలబ్రిటీలలా కేవలం ఇంటికే పరిమితమై డొనేషన్ ఇస్తే మా పనైపోయింది అనుకోకుండా! కొంత ఆర్ధిక సహాయం చేసి మరీ! ఇది మరీ భయపడిపోవాల్సిన జబ్బు కాదని తన సేవ ద్వారా చాటి చెప్పాడు. గోపీ చంద్ ఇలా చేయడం కొంత మంది హీరోలకి చెంప పెట్టులాగే అనిపించింది. మాయదారి కరోనా అంటుకుందో? వదిలిపోదు ఏ నిరుపేద ఎక్కడ నుంచి తెచ్చి అంటిచేస్తాడోనని భయ పడి చాలా మంది గడప దాటకుండా ఎంచక్కా టీవీల్లో సందేశాలిచ్చి సరిపెట్టుకున్నారు.
అటుపై దొస ఛాలెంజ్ లు..దోసకాయ ఛాలెంజ్ లు విసుకురుని టైంపాస్ చేసారు. అయితే ఇప్పుడు హిజ్రాల కోసం ఏ సెలబ్రిటీ ముందుకొస్తాడు? అంటూ కొంత మంది హీరోల అభిమానులు ఛాలెంజ్ లు విసురుతున్నారు. ప్రస్తుతం హిజ్రాల పరిస్థితి కూడా దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాలను ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆదుకుంటోంది. అయితే టాలీవుడ్ పరిశ్రమపై ఆధారపడిన హిజ్రాలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్లను టాలీవుడ్ సెలబ్రిటీలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణానగర్, ఇందిరా నగర్ ఏరియాల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ జీవనం సాగించే వారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్లకి సీసీసీ అందించిన నిత్యావసర సరుకులు అందనట్లు చెబుతున్నారు.ప్రత్యేకంగా వాళ్లను గుర్తించలేదని…తమను కూడా ఆదుకోవాడని ఓ పెద్ద సెలబ్రిటీ ముందుకు రావాలని కోరుతున్నారు. మరి వాళ్ల వ్యథలను గుర్తించి ఏ సెలబ్రిటీ ముందుకొస్తాడో? చూద్దాం. కనీసం ఇప్పటివరకూ చిల్లి గవ్వ ఇవ్వని ఏ స్టార్ హీరోయిన్ అయినా స్పందిస్తుందేమో చూడాలి.