హాట్ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డింది!

హాట్ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డింది!

సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తూ హీటెక్కిస్తున్న హాటీ ఆదా శ‌ర్మ ప్రేమ‌లో ప‌డింది. అయితే హీరోతో కాదు విల‌న్‌తో. తెలుగులో నితిన్ న‌టించిన `హార్ట్ ఎటాక్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా చెప్పుకొద‌గ్గ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోయింది. అల్లు అర్జున్‌తో క‌లిసి `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`, సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` చిత్రాల్లో ప్రాధాన్య‌తలేని పాత్ర‌ల్లో అతిథి పాత్ర‌ల్లో న‌టించింది.

ఇటీవ‌ల యంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన `క‌ల్కీ` చిత్రంలోనూ ఆదా హీరోయిన్‌గా న‌టించినా పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. బాలీవుడ్ చిత్రాల‌కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న ఆదా శ‌ర్మకు మార్ష‌ల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం వుంది. దాంతో యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింది. విద్యుత్ జంవాల్‌తో క‌లిసి క‌మాండో 2, క‌మాండో 3 చిత్రాల్లో న‌టించింది.

ఈ టైమ్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందట‌. గ‌త కొంత కాలంఆ ఇద్ద‌రూ డేటింగ్‌లో వున్నార‌ని తాజాగా బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ వార్తల‌పై విద్యుత్ జంవాల్ మాత్రం స్పందించ‌డం లేదు. ఆదా శ‌ర్మ ఈ వార్త‌ల్ని ఖండించ‌డం లేదు.