హాట్ హాట్ ఫోటో షూట్‌లతో నెటిజనులపై  ఈషా దాడి!

అవును.. సోషల్ మీడియాలో నెటిజనులపై హాట్ హాట్ ఫోటో షూట్‌లతో దాడికి దిగింది అందాల భామ ఈషారెబ్బా. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో సత్తా చాటిన తెలుగమ్మాయిలు చాలా తక్కువ. వారిలో ఒకరిద్దరు సక్సెస్‌ అయినా గ్లామర్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న వారు మాత్రం లేరనే చెప్పుకోవాలి. వారికి భిన్నంగా  తెలుగులో   తన సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఈషారెబ్బా.  
 
సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతుంటుంది.  ఈ మధ్య మీరు గ్లామర్ డోస్ పెంచినట్లు ఉన్నారు. ఎక్కువుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ ఫోస్ట్ చేస్తున్నారు? ఎందుకు? అని అడిగితే.. ”నిజానికి నన్ను ఇప్పటి వరకూ సంప్రదాయ పాత్రల్లోనే చూపించారు. నాలోని హాట్‌నెస్‌ని దర్శకనిర్మాతలు గుర్తించలేదు. ఒక వేళ గుర్తించినా, అలాంటి పాత్రలు నా దగ్గరకు రాలేదు. నాలోని హాట్‌నెస్‌ అందరికీ తెలియాలి కదా… అందుకే ఆ ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నాను. నా ఫోటోల్లో అశ్లీలం ఉందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం పరిశ్రమలో చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.  తెలుగు అమ్మాయిగా ఉండటం వలన అవకాశాలు రావు అని నేను అనుకోవడం లేదు. తెలుగు అమ్మాయిలు కూడా అన్ని రకాల పాత్రలలో అద్భుతంగా నటించగలరు అని నిరూపించాలని, నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడంలేదని కొందరు అంటున్నారు. నా వరకూ అలా ఎప్పుడూ అనిపించలేదు. అయితే నేను మాత్రం  సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కచ్చితంగా రెచ్చిపోతాను.   తెలుగమ్మాయిని కాబట్టి స్టీరియోటైప్‌ పాత్రలకు అలాగే ఎక్కువగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, ట్రెడిషనల్‌ పాత్రలకే నన్ను పరిమితం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేకర్స్‌లో కూడా మార్పు వస్తోంది. ఇషా అన్ని రకాల పాత్రలు చేయగలదని వాళ్లకు నమ్మకం కుదురుతుంది’ అని మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. దటీజ్.. ఈషా!?