హాట్ బ్యూటీ మరో సారి  స్పెషల్ సాంగ్‌లోనా!?

 
‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్  బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ మరో సారి  స్పెషల్ సాంగ్‌లో కనిపించి  కనువిందు చేయనుందట! అవును.. నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్‌ చేసిన అందాల భామ పాయల్‌ కు ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఎంతటి క్రేజ్ ని తెచ్చిపెట్టిందో తెలియంది కాదు.  తొలి ప్రయత్నంలోనే గ్లామర్‌ షోతో పాటు నెగెటివ్‌ రోల్‌లోనూ ఆకట్టుకుంది.  
 
ఆ తర్వాత నటించిన ఆర్డీఎక్స్‌ లవ్‌,  రవితేజ హీరోగా  డిస్కోరాజా సినిమాలు అనుకున్న ఇమేజ్ ని తెచ్చిపెట్టలేక పోయాయి పాయల్‌ కు . తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌కు చాన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్‌ నటించబోయేది హీరోయిన్‌గా కాదు. ఓ స్పెషల్ సాంగ్‌ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్ సాంగ్‌లో అలరించారు.
 
అయితే .. ‘మళ్లీ  స్పెషల్ సాంగ్‌లోనా!?’ అంటూ ఇండస్ట్రీ వర్గాలు, పాయల్ సన్నిహితులు పెదవి విరుస్తున్నారు!? ప్చ్.. పాయల్!