స‌మంతకి ఆ విష‌యంలో… ఎందుకో అంత తొంద‌ర‌

కోలీవుడ్‌లో నటిగా పరిచయమై టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఈ సుందరి. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న సమంత వివాహానికి ముందు గ్లామర్‌ డాల్‌ పాత్రల్లో నటించినా, ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తోంది. ‘ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన స‌మంత కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి.

తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ’96’ తమిళ రీమేక్ అయిన ‘జాను’ షూటింగును పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ, ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు తాజా సమాచారం. మ‌రి ఈ చిత్రం వారం ముందుగా రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక మ‌రి రీమేక్‌ల హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో స‌మంత‌కి ఇది కూడా మ‌రో హిట్ అవుతుందేమో వేచి చూడాలి.