రచయిత చిన్ని కృష్ణకు ఊహించని షాక్ తగిలింది . చిన్ని కృష్ణ రాసింది తక్కువ సినిమాలే కానీ పేరు మాత్రం ఎక్కువ వచ్చింది . కారణం అతన్ని అతను ప్రమోట్ చేసుకోడం. చిన్ని కృష్ణ తెలుగు సినిమా రచయితల స్టేటస్ పెంచానని చెబుతాడు . ఎంతో కాలం నుంచి వున్న పరుచూరి బ్రదర్స్ కన్నా తనకే ఎక్కువ పారితోషికం ఇస్తారని గర్వగా చెబుతాడని సహా రచయితలు అంటారు .
చిన్నికృష్ణ స్టైల్ , బిహేవియర్ , మాట్లాడే విధానం అన్నీ భిన్నంగా ఉంటాయి . అందరి కంటే తాను సుపీరియర్ నన్న అభిప్రాయం అతనిలో బలంగా వుంది . చిన్నికృష్ణ , నరసింహ నాయుడు , సీమ సింహం, ఇంద్ర, గంగోత్రి , బద్రీనాథ్ సినిమాలకు కథలు అందించాడు . ఆసినిమాలు సూపర్ హిట్ కావడంతో తెలియని అహం వచ్చేసిందని చెప్పుకుంటారు . అందుకే అతను ఎప్పుడూ వివాదాల్లో ఉంటాడని సన్నిహితులు ఆరోపిస్తుంటారు . ఇతని ప్రవర్తనకు విసిగిపోయిన అల్లు అరవింద్ బద్రీనాథ్ సమయంలో మీడియా ముందుకు రాకుండా పక్కన పెట్టారని చెప్పుకుంటారు .
ఇక తాజాగా చిన్ని కృష్ణ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో సభ్యుడుగా చేరాలని నిర్ణయించుకున్నాడు . తనకు తెలిసిన ఓ సభ్యుడిని సలహా అడిగితె “తప్పకుండా చేరండి , నేను ఇంట్రడక్షన్ సంతకం పెడతాను ” అని హామీ ఇచ్చాడు . ఆయన అధ్యక్షుడు కెఎల్ నారాయణ గారితో మాట్లాడితే , “సినిమా కేటగిరి లో తీసుకుందాం , అతను రచయిత కదా ” అన్నాడు . మామూలువారికి అయితే 16 లక్షలు వుంది. అదే సినిమా విభాగంలో అయితే 6 లక్షలే . చిన్ని కృష్ణను పిలిచి అప్లికేషన్ ఫారం ఇచ్చారు . అది పూర్తి చేసి ఫిలిం నగర్ కల్చరల్ ఉద్యోగితో మాట్లాడుతూ అతన్ని తిట్టాడు . అధ్యక్షుడు నారాయణ గారికి ఫోన్ చేశాడు . ఆయన ఎవరితోనో ఒక సారి మాట్లాడండి , సినిమా క్యాటగిరి ఆయన చూస్తాడు అని చెప్పాడు . దానికి చిన్ని కృష్ణ నారాయణ గారితో అనుచితముగా మాట్లాడినట్టు తెలిసింది . రెండురోజుల తరువాత కల్చరల్ సెంటర్ కు ఇంటర్వ్యూకు వచ్చాడు . అతనితో మాట్లాడి తరువాత తెలియజేస్తాం అని నారాయణ గారు అన్నారట. తీరా ఎవరైతే చిన్నికృష్ణను రెకమెంట్ చేశారో ఆ సభ్యుడుకు ఫోన్ చేసి ” చిన్ని కృష్ణ అప్లికేషన్ రిజెక్ట్ చేశాం , ఈ విషయం ఆయనకు చెప్పండి ” అని చావు కబురు చల్లగా చెప్పారట. నోరు వుంది కదాని పారేసుకుంటే ఇలాగే జరుగుతుందేమో ? ఇది చిన్ని కృష్ణకు ఊహించని షాక్ . కాదంటారా ?