‘సైరా’ పొరపాటు ….రాజమౌళి చేయడట

‘సైరా’ చేసిన తప్పుని..రాజమౌళి చేయటం లేదు

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా ..తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ బాగా నడుస్తోంది. దసరా శెలవులను పూర్తిగా యుటిలైజ్ చేసుకుంటూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయ్యింది. అందుకు కారణాలు అన్వేషిస్తే…తెలుగు నేటివిటిలో ఇక్కడ స్వతంత్ర్య పోరాట యోధుడు కథ చెప్తే అక్కడ వాళ్లు ఎవరూ ఐడింటిఫై అవ్వలేదని, అందుకే అక్కడ వాళ్లకు నచ్చలేదని తేల్చారు. నేటివిటి సమస్య బాగా వచ్చిందని అందుకే కనెక్ట్ కాలేదని విశ్లేషిస్తున్నారు.

అయితే అదే సమయంలో రాజమౌళి సైతం స్వతంత్ర్య పోరాట నేపధ్యంలో బ్రిటీష్ వాళ్లను విలన్స్ గా చూపెడుతూ..ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. అయితే రాజమౌళి ..సైరా లో వచ్చినటువంటి సమస్య తమ సినిమాలో రాకుండా ఉండేందుకు కాను ముందుగానే ఆలోచించి స్క్రిప్టులో అందుకు తగినట్లు ప్లాన్ చేసారు. ఈ సినిమాలో కొంతభాగాన్ని డిల్లీలో షూట్ చేస్తారు. ఇందులో హీరోలు ఇద్దరూ డిల్లీలో కలుస్తారు. అలా అప్పటి డిల్లీ..ఆ వాతావరణం చూపించటానికి అనువుగా ఉంటుంది. నార్త్ జనం ఐడెంటిటీ దొరుకుతుంది. రాజమౌళి ఈ విధంగా నేటివిటి సమస్య దాటటానికి సూపర్ స్కెచ్ వేసాడని ఇప్పుడు మెల్లిగా అందరికీ అర్దమవుతోంది.

ఈ కథ గురించి చెప్తూ రాజమౌళి…1897లో అల్లూరి సీతారామరాజు పుట్టాడు. అతను ఇంగ్లీష్‌తో పాటు వేదాలు, పురాణాల్లోను మంచి అవగాహన పెంచుకున్నాడు. రెండు ఏళ్ల పాటు ఆయన ఏమి చేసాడో ఎవరికీ తెలియదు.1901 రెండు మూడు సంవత్సరంలో కొమరం భీమ్ యుక్త వయసులో ఉండగానే ఇల్లు ఒదిలి వెళ్లిపోయాడు. ఆయన కూడా ట్రైబల్ స్వతంత్య్రం కోసం పోరాడాడు. ఇంటి నుంచి వెళ్లేటపుడు ఏమి చదువుకోని కొమరం భీమ్..ఆ తర్వాత చదువుకొని వస్తాడు. ట్రైబల్స్ కోసం పోరాడుతాడు. వీళ్లిద్దరు ఒకరి జీవితంలో మరొకరు కలసుకోలేదు. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి తెలిపాడు.