‘సైరా’ ఎఫెక్ట్… రాజమౌళికు తగిలి,టెన్షన్

‘సైరా’ ఎఫెక్ట్: రాజమౌళికు టెన్షన్

మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా ..తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ బాగా కలెక్ట్ చేస్తోంది. కానీ వేరే ఏ ఇతర లాంగ్వేజ్ లలోనూ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా హిందీలో పెద్ద డిజాస్టర్ గా మారింది. అందుకు ఎన్ని కారణాలు చెప్పుకున్నా దేశభక్తి ని హైలెట్ చేస్తూ స్వాతంత్ర్య పోరాటం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు అక్కడ ఆడటం లేదని తేల్చారు. ఇంతకు ముందు కూడా మంగళ్ పాండే, భగత్ సింగ్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు సైరా సైతం అక్కడ ఆడలేదు. దాంతో రాజమౌళికు ఈ విషయమై టెన్షన్ పట్టుకుందని అంటున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ కాంబినేషన్ లో రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సైతం స్వతంత్ర్య పోరాటం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. దాంతో తెలుగులో ఎన్టీఆర్ కు రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ తో వర్కవుట్ అయినా, నేషనల్ మార్కట్లో ఎంతవరకూ ఈ తరహా సినిమా చూస్తారనేది మీడియాలో చర్చనీయాంసంగా మారింది.

ఈ చిత్రం 1920 కథకు సంబంధించినది. పిక్షన్ స్టోరీని రియల్ క్యారెక్టర్లతో తీస్తున్నట్లు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారాయన. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలను కలిపి ఈ స్టోరీ తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ విప్లవకారులు యుక్త వయస్సులో ఉన్నప్పటి కథ అన్నారు. అల్లూరి, కొమరం ఇద్దరూ యుక్తవయస్సులో ఉన్నప్పుడు కొన్నాళ్లు ఉత్తరభారతం వెళ్లారని.. తిరిగి జ్ణానంతో వచ్చారన్నారు. ఈ కథాంశాన్ని తీసుకుని సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు.

స్వాతంత్ర సమరంకు ముందు అల్లూరి సీతారామరాజు.. ఉత్తర తెలంగాణ పోరాటవీరుడు కొమరం భీం ఒకే టైమ్‌లో పుట్టారని, అయితే ఇద్దరు కొన్నేళ్లపాటు కనిపించలేదని, అయితే అప్పుడు వాళ్లిద్దరు కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది అనే విషయాన్ని లైన్‌గా తీసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. RRR సినిమాలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌చరణ్.. కొమరం భీమ్‌‌గా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలిపారు.