సూర్య కొత్త చిత్రం ‘బందోబస్త్’ ఆగష్టులో విడుదల

సూర్య, మోహన్ లాల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రం ‘కాప్పాన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బందోబస్త్’ గా పేరు పెట్టారు. టైటిల్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమా ఆగష్టు లో అటు తమిళంలో ఇటు తెలుగు లో విడుదల కానుంది. సూర్య మార్కెట్ కొంత తగ్గినా ఇందులో మోహన్ లాల్ కూడా ఉండటం వల్ల ఈ సినిమా పట్ల ఆసక్తి కలిగింది అందరికీ.
దర్శకుడు కెవీ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య కి జోడీగా సయేశా నటించగా మరో కీలక పాత్రలో తమిళ నటుడు ఆర్య నటించాడు. హర్రీస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.