సింగీతం దర్శకత్వంలో  గాయకుడి బయోపిక్‌!?

 
సింగీతం దర్శకత్వంలో  గాయకుడి బయోపిక్‌!?
 
 
పుష్పకవిమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 చిత్రాల పేరు చెప్పగానే  మనకు  వెంటనే గుర్తుకు వస్తారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్  ఆయన…
 
 ఇటీవలి కాలంలో బాలయ్య సినిమాలు పల్టీలు కొడుతున్న ప్రతిసారీ  సక్సెస్ కోసం ఆదిత్య 369 సీక్వెల్ చేయొచ్చంటూ మాట వినిపించటం టాలీవుడ్ లో  మామూలైంది.  
 
తరువాత బాలయ్య  తనయుడు మోక్షజ్ఞ హీరోగా  సింగీతం సినిమా రూపొందించనున్నట్టూ వార్తలు చక్కర్లు కొట్టాయి.  కొత్తగా సింగీతాన్ని కోట్ చేస్తూ  టాలీవుడ్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.
 
ఓ గాయకుడి జీవిత కథను బయోపిక్‌గా రూపొందించే ఆలోచనలో ఉన్నారట. లెజెండరీ గాయకుడిగా గుర్తింపున్న ఆయనెవరు? అనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. త్వరలో సినిమాను ప్రారంభిస్తూ  అధికారిక  ప్రకటన వెలువడొచ్చన్న మాటా వినిపిస్తోంది. సింగీతం ఏదైనా స్క్రిప్ట్‌ని టేకప్ చేస్తున్నారంటే  దానిపై చాలామంది ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంటుంది. జాతీయస్థాయి గుర్తింపున్న సింగీతం, ఈ బయోపిక్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందిస్తారన్న మాటా వినిపిస్తోంది…
 
మరి బయోపిక్ అవుతోన్న ఆ గాయకుడెవరో తెలియాలంటే  కొంతకాలంనీరిక్షించాల్సిందేనేమో!?