సాహో చిత్రం రన్ టైమ్ అంత ఎక్కువా
అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’ . ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.350 కోట్లతో రూపొందుతోన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది.
వివరాల ప్రకారం 2గంటల 54 నిమిషాలు రన్ టైమ్‌తో సినిమా లాక్ అయ్యిందని టాక్. ఇప్పుడున్న పరిస్దితుల్లో మూడు గంటలు సినిమా అంటే రిస్క్. కానీ కంటెంట్ సౌండ్ గా ఉండటంతో ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఆగస్ట్ 30న సినిమా రావడం ఖరారైంది.
ఈ సినిమాలో అశోక చక్రవర్తి అనే అండర్ కవర్ కాప్‌గా నటిస్తుండగా.. శ్రద్ధాకపూర్ అమృతానాయర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. హాజీ సిటీలో బ్లాక్ బాక్స్ కోసం ప్రపంచంలోని గ్యాంగ్ స్టర్స్ అందరూ ప్రయత్నిస్తుంటారు. వారికి ధీటుగా ప్రభాస్ ఏం చేశాడనేదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత యువ దర్శకుడు సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ .. నమ్మకంతో తన స్నేహితులైన యు.వి.క్రియేషన్స్‌తో కలిసి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.