‘సాహో’ లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే. !.

దుమ్ము రేపుతున్న ప్రభాస్ సాహో సాంగ్

స్టార్ హీరోల సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కు ఎప్పుడూ ప్రయారిటీ ఉంటుంది. ఓ ఫైట్ తోనో, లేక పాటతోనో హీరోని పరిచయం చేస్తారు. అలాగే ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ సినిమాలోనూ హీరో ప్రభాస్ ని ఓ సాంగ్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నారని సమాచారం. ఆ సాంగ్ మరోదో కాదు ..ఈ రోజు విడుదలైన స్పెషల్ సాంగ్ .

ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ డాన్స్ చేశారు. ఎటు చూసినా అమ్మాయిలు..మధ్యలో బ్యాడ్ బోయ్ మరులు గొలిపేలా మెరిసిపోయారు. ‘మేబీ ఐ యామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కెన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి ఈ పాట సాగింది. జాక్వెలిన్‌ డ్యాన్స్‌, బ్యాటీ ఈ పాటకు స్పెషల్ ఎట్రాక్షగా నిలిచాయి. ఆమె, ప్రభాస్‌కు మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, అదిరిపోయిందని. సినిమాలో ప్రబాస్ ఇంట్రడక్షన్ సాంగ్ గా దీన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Saaho: Bad Boy Song | Prabhas, Jacqueline Fernandez | Badshah, Neeti Mohan

ఇప్పటి వరకు ఈ సినిమాలోని ‘సైకో..‌’, ‘ఏ చోట నువ్వున్నా..’ అనే రెండు పాటలు విడుదల చేశారు. ఇప్పుడు మూడో గీతంగా ‘బ్యాడ్‌ బాయ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.