‘సాహో’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్ తక్కువే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో హై ఎండ్ టెక్నాలజీతో తెరెకెక్కిన చిత్రం ‘సాహో’. టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్, విక్రమ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. టాక్ మాట ఎలా ఉన్నా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయటంలో బిజిగా ఉన్నాయి.
ట్రైలర్, టీజర్స్ ద్వారా పెరిగిన ఎక్సపెక్టేషన్స్ తో పాటు, ప్రభాస్ కంటిన్యూగా పాల్గొన్న ప్రొమోషన్స్ కార్యక్రమాల వలన సాహో చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనితో యూఎస్ లో ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్స్ కూడా స్థాయికి తగ్గట్టే వచ్చాయని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు సాహో యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారా $800,899 డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.మొత్తం 290 లొకేషన్స్ నుండి గురువారం రాత్రి 10:00 వరకు వచ్చిన సంచారం ప్రకారం సాహో ఆ కలెక్షన్స్ రాబట్టిందట. ఐతే ఈ చిత్రానికి వచ్చిన హైప్, తెరకెక్కిన బడ్జెట్ దృష్ట్యా చూస్తే ఈ కలెక్షన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి. వీకెండ్ తో పాటు, ఒక రోజు చవితి సెలవు దినం రావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.