బాహుబలి తర్వాత అంతే ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం `సాహో` కథా పరంగా హిట్ కాలేదుకానీ కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది. ఇక తన తర్వాత చిత్రం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు ప్రభాస్. అనుకున్నదానికంటే 4నెలలు ఆలస్యంగా ‘జాన్’ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ… సినిమా మొదలైన రోజు నుంచి కూడా ప్రతి విషయంలో ఏదో ఒక న్యూస్ తెలుస్తూనే ఉంది. ఈ సినిమాకి భారీగా క్రేజ్ ఉందని ఇటీవలే క్లోజ్ అయిన ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. ‘సాహో’ విజయవంతం కాకపోవడం వలన తర్వాత సినిమా బిజినెస్ కష్టం అన్న అందరూ అవాక్కయ్యే లాగా బిజినెస్ అయ్యిందనే చెప్పాలి.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అన్ని భాషలకి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ ని ఒకేసారి 25 కోట్లకి కొనుగోలు చేసింది. అనగా ఈ సినిమా లాభాలు రావాలంటే మినిమమ్ 5 మిలియన్స్ మార్క్ ని టచ్ చేస్తేగాని సాధ్యం కాదు. ఒక్క ప్లాప్ తన మార్కెట్ ని ఏ మాత్రం ఎఫెక్ట్ చెయ్యలేదని ప్రభాస్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. పెదనాన్న కృష్ణంరాజు గారు ఈ సినిమాని 2021లో రిలీజ్ చేస్తామని ఇటీవలె చెప్పినప్పటికీ, టీం మాత్రం ఈ ఏడాది దసరాకి అన్నీ ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మాములుగానే ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి చిత్రంతో అది రెట్టింపు అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం తెరకెక్కబోయే చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.
జాన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ, హీరో ప్రభాస్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. అన్ని హంగులతో భారీ రేంజ్ సినిమాగా తీర్చిదిద్ది రెబల్ స్టార్ అభిమానులకు స్పెషల్ మూవీ అందించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసమై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా మూవీస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.