‘సాహో’ ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియావైజ్)

‘సాహో’మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడం తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే నిర్మాతలు కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించామని చెప్పి, సాహో పై అంచనాలని రెట్టింపు చేసారు. దీనికి తోడు సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ అన్ని కుడా సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందనిపించేలా పబ్లిసిటీ జరిగింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ తొలి రోజు భీబత్సమైన కలెక్షన్స్ తెచ్చుకుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సాహో తొలి రోజు షేర్ 35.36 కోట్లు. నైజాం, నెల్లూరులో బాహుబలి రికార్డ్ లను బ్రద్దలు కొట్టింది. ఓవరాల్ గా నాన్ బాహుబలి రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఏరియా వైజ్ ఆ వివరాలు చూద్దాం.

 

ఏరియా షేర్                          (కోట్లలో)

——————– —————————————-

నైజాం                                 9.40

సీడెడ్                         4.40

నెల్లూరు                     2.56

కృష్ణా                         2.51

గుంటూరు                         4.69

వైజాగ్                         3.77

ఈస్ట్ గోదావరి                      4.43

వెస్ట్ గోదావరి                  3.60

ఆంధ్రా, తెలంగాణా షేర్                35.36

సాహో సినిమాలో కావాల్సినంత యాక్షన్స్ ఎపిసోడ్స్ తప్ప కథలో కొత్తదనం , సరైన బలం లేకపోవడంతో థియేటర్లలో సాహో తేలిపోయింది. కనీసం హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది.