‘సాహో’పై మీడియా కుట్ర…ఏం ఆశించి?

‘సాహో’పై ద్వేషం పుట్టించే ఆలోచన ఎవరిది?

పెద్ద సినిమాలు అంటే కోట్లతో వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా అదే స్దాయిలో నష్టాలు ఉంటాయి. దాంతో ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తూంటారు. ఎక్కడా రాజీ పడకుండా ఎలా నిర్మాణం జరుపుతారో..అలాగే అందరి హీరోల అభిమానులు తమ సినిమాలు చూడాలని వారితో ఏ విధమైన ఫ్యాన్ వార్ లు లేకుండా ఉండాలని భావిస్తారు. కానీ మధ్యలో నారద పాత్ర వహిస్తూంటాయి మీడియా సంస్దలు. అప్పటికప్పుడు తమ లబ్ది కోసం అకారణ ద్వేషాన్ని అభిమానుల మనస్సుల్లో ఎక్కిస్తూంటాయి. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న ‘సాహో’ పైనా అలాంటి మీడియా కుట్రే జరుగుతోందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.

కేవలం నెల రోజుల వ్యవధిలో టాలీవుడ్‌ నుంచి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘సాహో’ అయితే రెండోది ‘సైరా’. ఈ రెండు చిత్రాల మొత్తం బడ్జెట్‌ దాదాపుగా రూ.600 కోట్లు. ఈ రెండు సినిమాల మధ్య విరోధం పెట్టి చోద్యం చూడాలనుకుంటున్నారు కొందరు మీడియా మేధావులు. ఈ రెండు సినిమాలను పోల్చుతూ సైరాని చిన్నది చేసి ఆ విధంగా మెగాభిమానులకు సాహో పై ద్వేషం పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

బాలీవుడ్ లో సైరాని ఎవరూ పట్టించుకోవటం లేదని, సాహో కే క్రేజ్ అంతా అని అంటూ ద్వేషం రాజేస్తున్నారు. అప్పటికీ ప్రభాస్ అందరినీ కలుపుకుపోయే ధోరణిలో ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అంతేకాకుండా రజనీ, చిరు తన అభిమాన హీరోలు అన్నాడు. ఆ స్నేహభావ వాతావరణం లేకుండా చేయాలని ఈ మీడియా సంస్దలు కంకళం కట్టుకున్నట్లుగా వ్యవరిస్తున్నాయి. అయితే వారికి ప్రత్యేకంగా కలిసొచ్చేది ఏమన్నా ఉందా..అదేమీ లేదు. కేవలం ఆ రోజుకు తమ పైత్యాన్ని జనాలకు ఎక్కించటమే వారి పని. ఇది మాత్రం పద్దతి కాదు.