షాలినీతో చెయ్య‌డం అదృష్ట‌మంట‌…?

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రం ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. మొదట్నుంచీ ఈ సినిమాపై రాజ్‌తరుణ్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. తనకు సెంటిమెంట్‌ అయిన డిశంబర్‌ 25న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు. ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమవుతుందని, ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న హిట్‌ తన సొంతమవుతుందని రాజ్‌ తరుణ్‌ భావిస్తున్నాడు. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ విషయానికి వస్తే, ‘ఇద్దరి లోకం ఒక్కటే’ హార్ట్‌ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ అని ట్రైలర్‌ ద్వారా క్లియర్‌ అయిపోయింది.

ట్రైలర్‌ ఎండ్‌ చేసిన విధానం నాగార్జున నటించిన ‘గీతాంజలి’ మూవీని గుర్తు చేసింది. ఆధ్యంతం ట్రైలర్‌లో రాజ్‌ తరుణ్‌ – షాలినీ పాండే మధ్య లవ్‌ ట్రాక్‌ని చూపించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో… హీరో రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో నాకు న‌టించే అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి, ఈ క్యారెక్ట‌ర్‌లో న‌న్ను ఊహించుకున్న డైరెక్ట‌ర్ కృష్ణ‌గారికి, బెక్కం వేణుగోపాల్‌గారికి థ్యాంక్స్‌. షాలిని పాండే ఎక్స‌లెంట్ పెర్ఫార్‌మ‌ర్‌. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్నంగా ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే త‌న‌తో క‌లిసి నటించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ర‌విగారు, అద్భుత‌మైన మాట‌లను అందించారు. మిక్కి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. ఆయ‌న‌తో ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. స‌మీర్‌గారికి, త‌మ్మిరాజు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. ఇదొక హార్ట్ ట‌చింగ్ ఫీల్ గుడ్ మూవీ. ప్రేక్ష‌కుడు సినిమా చూసేట‌ప్పుడు ల‌వ్‌ను ఫీల్ అవుతాడు. ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా సినిమా హాంట్ చేస్తుంది. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది“ అన్నారు. అలాగే ఈ సినిమా నా మొద‌టి సినిమా ఉయ్యాలా జంపాలా ఎప్పుడైతే విడుద‌లైందో అదే తేదీకి అదే రోజున విడుద‌ల‌వుతుంది. ఆ చిత్రం ఎలాగైతే స‌క్సెస్ అయిందో ఇది కూడా అలాగే స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.