షాకిస్తున్న రేణుదేశాయ్ కోరిక‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ స‌తీమ‌ణి వింత కోరిక‌లు కోరుతోంది. ఆ కోరిక‌లు విన్న వాళ్లు షాక్ కు గుర‌వుతున్నారట‌. `బ‌ద్రి` సినిమా టైమ్‌లో ప్రేమ‌లోప‌డిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రేణుదేశాయ్ జోడీ ఆ త‌రువాత నుంచి స‌హ‌జీవ‌నం చేశారు. మొద‌టి భార్యకు విడాకులు ఇవ్వ‌క‌పోవ‌డంతో చ‌ట్ట‌రీత్యా రెండ‌వ పెళ్లి బాహాటంగా చేసుకుంటే నేరంగా భావిస్తార‌ని భావించి సైలెంట్‌గా మూడుముళ్ల వ్య‌వ‌హారాన్ని కానిచ్చిన ఈ జంట ఇద్ద‌రు పిల్లలు పుట్టిన త‌రువాత విడిపోయిన విష‌యం తెలిసిందే.

అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌కు, మెగా కుటుంబానికి దైరంగా వుంటూ వ‌స్తున్న రేణూ దేశాయ్ ద‌ర్శ‌కురాలిగా `ఇష్క్ వాలా ల‌వ్‌` సినిమాతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఆ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో డైరెక్ష‌న్‌కి దూరంగా వుంటూ వ‌చ్చిన రేణూ ప‌లు టీవీ షోల్లో హోస్ట్‌గా వ్యవ‌హ‌రించింది. త‌రుచు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి టార్గెట్ అవుతోంది.

తాజాగా రేణుదేశాయ్ దృష్టి మ‌ళ్లీ సినిమాల‌పై ప‌డింది. మాద‌ర్ పాత్ర‌ల్లో అయినా తాను న‌టించ‌డానికి రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇస్తోంది. ఏకంగా స్టార్ హీరోలు మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌కు త‌ల్లిగా న‌టించాల‌ని వుందిని, అలాంటి అవ‌కాశం వ‌స్తే క‌చ్చితంగా చేస్తాన‌ని చెబుతోంది. ఆ ఇద్ద‌రి హీరోల కంటే రేణు దేశాయ్ చిన్న‌ది. అదేలా సాధ్య‌మౌతుంది అంటే అది ద‌ర్శ‌కుడు చూసుకుంటాడ‌ని చెబుతోంది. ఆమె కోరికి విన్న వాళ్లంతా షాక‌వుతున్నారు.