Pushpa OTT: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్? ఎప్పుడంటే..!

Pushpa OTT: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఫ్యాన్స్ కు ఫుల్​మీల్స్​ పెట్టేసింది. బన్నీ​-సుకుమార్​ కాంబినేషన్​ మరోసారి బాక్సాఫీసు దగ్గర అదరగొట్టేసి మంచి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు.

రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా సరే ఇప్పటికీ చాలా చోట్ల ప్రేక్షకులు ‘పుష్ప’ను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతూ కనిపిస్తున్నారు. అయితే థియేటర్లలో ఈ మూవీ హవా కొనసాగుతుండగానే ఓటీటీ రిలీజ్​పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చిత్రం డిజిటల్​ రైట్స్​ ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జనవరి 7 నుంచి ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుందని టాక్. ఇంతవరకు ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలి.

వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. క్రేజీ ప్రాజెక్ట్స్ ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కింది. సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఏ మాత్రం చూపకుండా బాక్సా ఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్.

‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు బన్నీ.

రష్మిక హీరోయిన్ గా బాగా అలరించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.