శ్రీరెడ్డి పచ్చిగా స్పందించడంలో నెంబర్ వన్. తనకు ఏది అనిపిస్తే అది.. లైవ్ అని కూడా చూడకుండా పచ్చి బూతులు మాట్లాడటం శ్రీరెడ్డి స్టైల్. తనతో మాట్లాడాలన్నా.. తన టాపిక్ తీయాలన్నా సెలబ్రిటీలు భయపడుతంటారు. దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని శ్రీరెడ్డి తరచూ సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
తమిళ హీరో విశాల్‌ని టార్గెట్ చేసి తమిళ ఇండస్ట్రీలో రచ్చకు తెరలేపిన శ్రీరెడ్డి కన్ను తాజాగా తమిళ హీరోయిన్ అమలాపాల్ పై పడింది. అమలాపాల్ దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత విడిపోయిన విషయం తెలిసిందే. అమలతో విడిపోయిన ఏ.ఎల్. విజయ్ వెంటనే పెళ్లి చేసుకుని సెటిలైపోయాడు.
అమలాపాల్ మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూనే పంజాబ్‌కు చెందిన భవీందర్‌సింగ్‌తో డేటింగ్ చేసింది. ఈ విషయంపై మీడియాలో వార్తలు షికారు చేసిన అమల ఏమాత్రం బయటపడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. అయితే తాజాగా తన వివాహం భవీందర్‌సింగ్‌తో జరిగిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలని పోస్ట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు.
ఇదే సమయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏం బాధపడకు అమలా పంజాబ్ మొగుడు నిన్న బాగానే సుఖపెడతాడులే. ఆ విషయం నాకు బాగా తెలుసు అని సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అంటే శ్రీరెడ్డి మాటల్లో వున్న అర్థం మరీ ఘాటుగా వుందని, మరి దీనిపై అమలా పాల్ ఎలా స్పందిస్తుందో చూడాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.