అమరావతిలో రాజధానిని నిర్మించాలని గత ప్రభుత్వం నాయాన్నో భయాన్నో రైతుల నుంచి విలువైన భూముల్ని లాక్కుని రాజధాని కోసం ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కార్యాలయాలని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. అసెంబ్లీనీ, హై కోర్టుని, పాలనకు సంబంధింన పలు కార్యాలయాలని కూడా నిర్మించారు. అయితే అధికారం టీడీపీ నుంచి చేతులు మారి వైసీపీకి చేతికి చిక్కడంలో కొత్త ఆట మొదలైంది. అధికార వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుత సీఎం ఏపీలో మూడు రాజధానులు వుండాల్సిందే అని, వైజాగ్‌ని అడ్మినిస్ట్రేటీవ్ రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ నిర్ణయం అమరావతి రైతులకు అశనిపాతంగా మారినా టాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్‌లకి మాత్రం గోల్డెన్ ఛాన్స్‌గా మారబోతోందట. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని, థియేటర్ వ్యవస్థని చాలా వరకు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు కన్ను ఇప్పుడు వైజాగ్‌పై పడింది. ఇప్పటికే వీరిలో సురేష్‌బాబుకు అక్కడి కొండపై స్టూడియో వుండగా మరిన్ని స్థలాలని అదుపులోకి తీసుకున్నారట. సినిమా వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్‌ని కూడా స్పీడప్ చేయబోతున్నారట.
అల్లు అరవింద్‌కి కూడా వైజాగ్‌లో, దాని చుట్టు పక్కల భారీ స్థాయిలోనే భూములున్నాయట. ఆయన పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) వైజాగ్ భూమ్‌ని పెద్ద వ్యాపారంగా మార్చుకోవాలని కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌ని మొదలుపెట్టాలని ఇప్పటికే భారీ స్కెచ్‌ని రెడీ చేసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన సినిమా వాళ్లు రాజధాని మార్పు ఈ ఇద్దరికీ భలే కలిసొచ్చేలా వుందే అని అవాక్కవుతున్నారట.