వయస్సు పెరిగే కొద్ది కుర్ర హీరోయిన్లతో సరసాలు

రవితేజకు జోడీగా చేసిన హీరోయిన్లకున్లకు ఒకప్పుడు  మంచి ఎలివేషన్ ఉండేది. ప్రస్తుతం రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తుండటంతో ఆ ప్రాజెక్టుల్లో చేసిన హీరోయిన్ల కెరీర్‌కు ఏమాత్రం లాభం చేకూరడం లేదు.
 
సో, రవితేజతో జోడీ కట్టనున్న ఇస్మార్ట్ భామ నిధి అయినా ఈ పరిస్థితిని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తదుపరి ప్రాజెక్టునూ ఇప్పటికే లైన్‌లో పెట్టాడు. గతేడాది ‘రాక్షసుడు’ రీమేక్‌తో మంచి హిట్టుకొట్టిన రమేష్ వర్మ ఈసారి తమిళ హిట్టు ‘శతురంగ వెట్టై’ని రవితేజతో రీమేక్ చేయనున్నాడు.
 
రవితేజ -రమేష్‌వర్మ కాంబోలో రానున్న ప్రాజెక్టుకు హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. గతంలో రవితేజకు జోడీగా చాన్స్ వస్తే  ఆ హీరోయిన్ రొట్టెవిరిగి నేతిలో పడినట్టే అన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రవితేజకే సరైన హిట్టులేని పరిస్థితుల్లో.. జోడీగా నటించిన హీరోయిన్లకూ గొప్ప బ్రేక్ రావడం లేదు.
 
ప్రస్తుతం నిధి అగర్వాల్ కెరీర్ కూడా అంత స్పీడ్‌గా లేదు. ఇస్మార్ట్.. తరువాత వరుస చాన్స్‌లు రావొచ్చని అనుకున్నా  అలాంటి సీన్ కనిపించలేదు. సీనియర్ హీరో రవితేజకు జోడీగా చాన్స్ రావడంతో -ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట కుర్ర బ్యూటీ. అయితే, ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనిపించుకుంటుందా? అన్న చర్చ మొదలైంది ఇండస్ట్రీలో.  
 
రమేష్‌వర్మ చేస్తున్న రీమేక్ కనుక వర్కౌటైతే  రవితేజతోపాటు నిధి కెరీర్‌కూ మేలు జరగడం ఖాయం అంటున్నారు.  అయితే కొంత మంది మాత్రం ఇస్మార్ట్ భామకు  బ్రేక్ పగటికలే! అని వాపోతున్నారు. ప్చ్..ఇస్మార్ట్ భామ!?