లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు డిమాండ్ పెరిగింది. ఇంత కాలం ఓటీటీలకు దూరంగా వున్న వాళ్లంతా ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి దగ్గర టైమ్ గడవకపోవడంతో అత్యధిక శాతం మంది డిజిటల్ మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఇది ఏమాత్రం ముందుగా గ్రహించలేకపోయిన అల్లు అరవింద్ కొంత విచారం వ్యక్తం చేసినా ప్రస్తుతం మాత్రం పక్కా ప్రణాళికని సిద్ధం చేస్తున్నాడని తెలిసింది.
ప్రస్తుతం డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ తరువాత ఎలాగూ థియేటర్లు ఓపెన్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి `ఆహా` కోసం యువ టాలెంట్స్‌ని హైర్ చేసుకుని వారి ఇన్నోవేటీవ్ థాట్స్‌తో కొత్త తరహా వెబ్ సిరీస్‌లకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ స్క్రీనింగ్ కోసం ఓ ఆప్ బీట్ ఫిల్మ్ మేకర్‌ని హైర్ చేసుకున్న అల్లు అరవింద్ కొత్త దర్శకులకు, నిర్మాతలకు, రైటర్లకు ఫోన్‌లు చేస్తున్నారట.
కొత్త తరహా థాట్స్‌తో, తక్కువ బడ్జెట్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మించమనపి, అందుకు తాను మంచి అమౌంట్‌ని అంద.ఏస్తానని చెబుతున్నారట. `ఆహా`లో వున్న కంటెంట్ చాలా పాతది. క్రిష్ `మస్తీస్, గల్లీ పోరడు, హర్షకు సంబంధించిన వెబ్ సిరీస్, సిన్స్ తప్ప ఆహాలో చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు. దీంతో ఓటీటీకి వ్యూవర్స్ పెరగడం లేదు. ప్రస్తుత సమయంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ప్రైమ్, జీ5, ఆల్ట్ బాలాజీ, మ్యాక్స్ ప్లేయర్‌ల ధాటికి తట్టుకుని నిలబడాలంటే వాటితో పోటీపడాల్సిందేనని భావించిన అల్లు అరవింద్ ఆ రేంజ్ కంటెంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రయత్నం అయినా ఆహాని ఓహో అనిపిస్తుందేమో చూడాలి.