రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం క‌రోనాపై యుద్ధం ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 21 కోజుల పాటు లాక్ డైన్‌ని ప్ర‌క‌టించింది. మ‌రో రెండు వారాలు దాటితే ఫ‌లితం ఎలా వుంటుందో తెలియ‌దు. ఈ రెండు వారాలే కీల‌కం అంటూ చాలా ప్ర‌చారం కూడా ఊపందుకుంది.

స్టార్ హీరోలంతా లాక్ డౌన్ కార‌ణంగా ప‌ని కోల్పోయి నిత్యావ‌స‌రాల కోసం సామాన్యులు న‌ర‌కం చూస్తున్నారు. దీంతో స్టార్స్ అంతా ఫిల్మ్ వ‌ర్క‌ర్స్ కోసం ముందుకొస్తున్నారు. త‌మ వంతు స‌హాయంగా విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. మెగాస్టార్ నుంచి సందీప్ కిష‌న్ వ‌ర‌కు విరాళాలిస్తున్నారు. కానీ ఒక్క హీరో మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. అస‌లు సోష‌ల్ మీడియాలోనే క‌నిపించ‌డం లేదు. వినిపించ‌డం లేదు. అత‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఇటీవ‌ల సామాజిక సేవా కార్య‌క్రామ‌ల‌కు ముందుండి అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ క‌రోనా వైర‌స్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి సైలెంట్ అయిపోయాడు. తెలంగాణ ప్ర‌భుత్వం కోసం క‌రోనా అవేర్‌నెస్ వీడియోలో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌రువాత మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఎందుకీ మౌనం? ఏం చేయ‌బోతున్నాడు. ఏది చేసినా అందిరికి భిన్నంగా చేసే విజ‌య్ దేవ‌ర‌కొండ క‌రోనా బాధితుల కోసం ఏదైనా కొత్త‌గా ప్లాన్ చేస్తున్నాడా? ఈ విష‌యంలో మౌనంగా ఎందుకు వుంటున్నాడ‌న్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.