ఒక్క ఐడియా జీవితాన్నిమార్చేస్తుందో లేదో తెలియదు కానీ ఒక్క సినిమా ఫ్లాప్ ఖచ్చితంగా కెరీర్‌ని మారుస్తుందన్నది మాత్రం విజయ్ దేవరకొండ విషయంలో నిజం అయ్యేలా కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల్లో వున్న విజయ్ దేవరకొండకు తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్` గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
దీంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టాలని ఎదుర్కొన్నారు. ఇందులో సునీల్ నారంగ్, అభిషేక్ అగర్వాల్ భారీగా నష్టపోయారట. దీంతో కె.ఎస్. రామారావుని సమావేశానికి పిలిచి రికవరీ పరిస్థితి ఏంటని నిలదీశారట. దీనికి తానేమీ చేయలేనని, దీనికంతటికి విజయ్ దేవరకొండనే కారణమని, అతన్నే అడుక్కోండని చేతులు ఎత్తేశాడట. విషయం సీరియస్ కావడంతో నష్టపోయిన వారంతా పూరి జగన్నాథ్‌తో పాటు విజయ్‌కి ఓ లెటర్ పంపినట్టు తెలుస్తోంది. మా నష్టాల సంగతి తేలిస్తేనే మీ సినిమా రిలీజ్ అవుతుందని, లేదంటే నైజాంలో రిలీజ్ కానివ్వమని అల్టిమేటమ్ జారీ చేశారట. ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారినట్టు తెలుస్తోంది.