విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రం భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. సినిమా రిలీజ్ తరవాత హీరో, దర్శకుడు, నిర్మాత మీడియా ముందుకు రాలేదంటే సినిమా ఏ స్థాయిలో దారుణమైన ఫలితాన్ని అందించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఫ్లాప్ సినిమాకి రీమేకా? ఈ సాహసానికి పూనుకుంటున్న నిర్మాత ఎవరు? అని ఆరాతీస్తే కరణ్‌జోహార్ అని తెలిసింది. ప్రస్తుతం పూరిజగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో వస్తున్న చిత్రాన్ని కరణ్‌జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రం ఫ్లాప్ అయిందని తెలుసుకున్న కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారట. స్టోరీ తెలుగు కంటే హిందీకి బాగా వర్కవుట్ అవుతుందని, ఈ చిత్రాన్ని తాను రీమేక్ చేస్తానని చెప్పారట. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం వుందని తెలిసింది. ఇదే జరిగితే కె.ఎస్. రామారావు కొంతలో కొంత నష్టాల నుంచి బయటపడ్డట్టే.