యూత్‌లో రౌడీ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. అతని సినిమాలు ఈ మధ్య ఆశించిన విజయాల్నిసాధించలేకపోతున్నాయి. అయినా అతని క్రేజ్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదు. వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినా అతని మార్కెట్ స్థాయిలో ఏ మాత్రం మార్పులు రాలేదు. కారణం అతని క్రేజే. అదే క్రేజ్‌ని బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ మార్కెట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.
`వరల్డ్ ఫేమస్ లవర్` ఫలితం విషయంలో ` బంతి గాల్లో వుందని అది బౌండరీ దాటుతుందో ఏమౌతుందో తెలియదని ముందే హింట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ కావడంతో తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్‌లో పూర్తిగా లీనమైపోయాడు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ క్రేజ్‌ని గమనించిన కరణ్ అతనితో 100 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ క్రేజ్‌కి తగ్గట్టు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయాలని కరణ్ ప్లాన్ చేస్తున్నాడట.
దీని కోసమే విజయ్ దేవరకొండకు 100 కోట్ల డీల్ ఆఫర్ చేశారని తెలిసింది. ఇది ఎంత వరకు నిజం అన్నది కరణ్ జోహార్ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం వెల్లడి కాదు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.