చందు రూపొందించిన `టెన్త్ క్లాస్` చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సునైన. ఆ తరువాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్ర సీమకు చెక్కేసింది. అక్కడ చిన్నా చితకా చిత్రాలతో పాటు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ హీరోని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో `పంజా` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన సోదరుడు క్రిష్ణ తమిళంలో నటుడు. గత కొంత కాలంగా హీరోగా, హీరోలకు సపోర్టింగ్ యాక్టర్‌గా నటిస్తున్నాడు. ఇతనితో గతంలో కొన్ని చిత్రాల్లో నటించిన సునైన ప్రేమలో పడిందని తెలిసింది. ఇద్దరు కలిసి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారట. త్వరలో పెళ్లికి రెడీ అయిపోతుండడం చర్చనీయాంశంగా మారింది.
క్రిష్ణకు 2014లో హేమలత అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటి నుంచే క్రిష్ణతో సునైన టచ్‌లో వుందట. తనకిది ఫస్ట్ మ్యారేజ్ కావడంతో ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెబుతున్నారట.