రామ‌రాజు టాస్క్‌ కంప్లీట్ .. ఛాలెంజ్ బాలీవుడ్‌కి షిఫ్ట్‌!

రామ్‌చ‌ర‌ణ్

సందీప్ వంగ మొద‌లుపెట్టిన ఛాలెంజ్‌ని రాజ‌మౌళి స్వీక‌రించి ఆ స‌వాల్‌ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌, కీర‌వాణి, సుకుమార్‌ల‌కు విరిసిన విష‌యం తెలిసిందే. ఇది రెండు రోజుల తేడా తోనే వైర‌ల్‌గా మా‌రుతోంది. రాజ‌మౌళి ఛాలెంజ్‌ని స్వీక‌రించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంటి ప‌నిలో త‌న శ్రీ‌మ‌తికి స‌హాయం చేసి ఈ వీడియోని తాజాగా షేర్ చేశాడు.

మంగ‌ళ‌వారం ఉద‌యం `మ‌న ఇంట్లో ప్రేమ‌లు ఆప్యాయ‌త‌లే కాదు ప‌నులు కూడా పంచుకుందాం అని ఇంటి ప‌ని చేసి మ‌రీ బీ ద రియ‌ల్‌మెన్ అనిపించుకున్నారు. తాజాగా రాజ‌మౌళి విసిరిన ఛాలెంజ్‌ని స్వీక‌రించిన రామ్‌చ‌ర‌ణ్ త‌ను కూడా ఇంటి ప‌ని, తోట ప‌ని చేసి చివ‌రికి త‌న శ్రీ‌మ‌తికి కాఫీ క‌లిపి అందించి టాస్క్‌ని పూర్తి చేశాడు. టాలీవుడ్‌లో మొద‌లైన ఈ ఛాలెంజ్ రామ్‌చ‌ర‌ణ్ ద్వారా బాలీవుడ్‌కు పాకింది. టాస్క్‌ని పూర్తి చేసిన రామ్‌చ‌ర‌ణ్ `ఇంట్లో పనులను చేయడంలో గర్వపడదాం! నిజమైన పురుషులుగా ఉండి, పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేద్దాం. అని ట్వీట్ చేశారు.

ఈ ఛాలెంజ్‌కి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, ర‌ణ్‌వీర్‌సింగ్, రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్‌ల‌ని నామినేట్ చేశాడు. దీంతో టాలీవుడ్‌లో మొద‌లైన బీ ద రియ‌ల్‌మెన్ ఛాలెంజ్ బాలీవుడ్‌ని తాకింది. రామ్‌చ‌ర‌ణ్ ఛాలెంజ్‌కి ర‌ణ్‌వీర్‌సింగ్‌, త్రివిక్ర‌మ్‌, రానా, శ‌ర్వానంద్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ‌