రానా అడిగితే కీర్తి కాదందా?

ఈ శీర్షిక చూసి అందరికీ రానా ఏమడిగాడు ఆమె ఏమి కాదండి అనే ఆసక్తి కలిగి ఉండచ్చు. వివరాల్లోకి వెళ్తే, తాజాగా అనుష్క, సమంత తరువాత కొత్తగా వచ్చిన హీరోయిన్లలో కేవలం హీరో పక్కన పాటలకే పరిమితం అయిపోకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుని వాటికి న్యాయం చేసి జాతీయ అవార్డును సైతం గెలుచుకున్న నటి కీర్తి సురేష్.

రానా దగ్గుబాటి ఈ మధ్య సినిమాలను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రధానంగా సాగే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించిందట. తన వయసుకు, శరీర భాషకు పోలీస్ పాత్రలు నప్పవని అనుకుందో ఏమో కాదందట. దాంతో మళ్ళీ రానా చిత్ర బృందం మరో కథా నాయిక కోసం వెతుకుతున్నారు.

ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె నరేంద్ర నాథ్ దర్శకత్వంలో ‘మిస్ ఇండియా’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కూడా ఆమెది నటనకు ఆస్కారం ఉన్న పాత్రేనట.