రాజ‌మౌళి హాలీవుడ్‌..క్రిష్ బాలీవుడ్‌!

`ఆర్ ఆర్ ఆర్` చిత్రం కోసం రాజ‌మౌళి హాలీవుడ్ స్టార్స్‌ని దించేస్తే క్రిష్ ప‌వ‌న్ కోసం బాలీవుడ్ స్టార్‌ల‌ని దించేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ ఓ పిరియాడిక్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో వార్త సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్‌ న్యూస్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ‌ల సాయ‌న్న క‌థగా ఈ చిత్రాన్నిక్రిష్ తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం మూడు భారీ సెట్‌ల‌కు సిద్ధం చేశారు. త్వ‌ర‌లోనే ఆ సెట్‌ల‌లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్లు జ‌రుగుతున్నాయి. దీంతో కీల‌క క్యారెక్ట‌ర్లని క‌న్ఫ‌మ్ చేసేప‌నిలో ప‌డ్డారు క్రిష్‌. త‌న‌కు బాలీవుడ్‌లో ప‌రిచ‌యాలు వుండ‌టంతో ప‌వ‌న్ సినిమా కోసం బాలీవుడ్ నుంచి సెక్సీ లేడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని, విల‌న్‌గా అర్జున్ రాంపాల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. అర్జున్ రాంపాల్ పాత్ర సినిమాలో ఎలా వుంటుంది? అత‌ని పాత్ర ఏంటి? అన్నది మాత్రం తెలియాల్సి వుంది.