లైఫ్ రిస్క్ చేసి పులితో ఫైట్ చేసిన ఎన్టీఆర్ !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్న ఈ సినిమా ఊహ‌కంద‌ని ప్ర‌త్యేక‌త‌ల‌తో.. సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సిద్ధ‌మ‌వుతోంది. మాస్ ప‌ల్స్ తెలిసిన రాజ‌మౌళి ఈ చిత్రాన్ని అడుగ‌డుగున రోమాంచిత‌మైన సీన్‌ల‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఎన్టీఆర్‌పై టైగ‌ర్ జోన్‌లో చిత్రీక‌రించిన టైగ‌ర్ ఫైట్ కు సంబంధించి ఓ ఫొటో లీక్ కావ‌డంతో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని `ఛ‌త్ర‌ప‌తి` శేఖ‌ర్ బ‌య‌ట‌పెట్టేయ‌డంతో ఆ గెట‌ప్‌లు ఏంటి? ఎలా వుండ‌బోతున్నాయి అనే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఓ వార్త ఎన్టీఆర్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఈ చిత్రంలో ఓ ఫైట్‌ని షూట్ చేశారు. అయితే ఈ ఫైట్ కోసం టైగ‌ర్ జోన్‌లో ఎన్టీఆర్ లైఫ్ రిస్క్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తెలిసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం పేరుతో ఎంత టైగ‌ర్ వుంటె మాత్రం ఇంత రిస్క్ చేయ‌డం అవ‌స‌ర‌మా ఎన్టీఆర్? అని అవాక్క‌వుతున్నార‌ట‌.